పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు..ఏర్పాట్లు వేగవంతం చేయాలి
వరంగల్ - ఖమ్మం - నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక కోసం ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. ఎన్నికల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఐడీవోసీలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
- పోలింగ్ కోసం సిబ్బందిని నియమించి శిక్షణ ఇవ్వాలి
- ఎన్నికల బందోబస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలి
- అధికారుల సమావేశంలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్
మామిళ్లగూడెం, మే 16: వరంగల్ – ఖమ్మం – నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక కోసం ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. ఎన్నికల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఐడీవోసీలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 27న, కౌంటింగ్ జూన్ 5న జరుగనున్నట్లు చెప్పారు.
పోలింగ్‌కు సిబ్బందిని నియమించాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 118 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అందుకోసం 142 మంది పీవోలు, 142 మంది ఏపీవోలు, 284 మంది ఓపీవోలు అవసరమున్నట్లు వివరించారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో 83,879 మంది పట్టభద్రుల ఓటర్లున్నందున రిజర్వుతో కలుపుకొని 129 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్నీ ఆర్డీవోలు, తహసీల్దార్లు పరిశీలించి వసతులు కల్పించాలన్నారు. బ్యాలెట్ పత్రాల తనిఖీకి సంబంధిత బాధ్యులు పోలీస్ సెక్యూరిటీతో వెళ్లాలని సూచించారు.
ఓటర్ స్లిప్పుల పంపిణీ ఎంతో ముఖ్యమని, అది వంద శాతం పూర్తి కావాలని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఖమ్మం ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో, రిసెప్షన్ కేంద్రాన్ని నల్గొండలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రూట్ల ఏర్పాటుకు కార్యాచరణ చేసి రవాణా ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. బందోబస్తు కోసం పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు సోమశేఖరశర్మ, శ్రీరామ్, శ్రీనివాసరెడ్డి, రాజేశ్వరి, గణేశ్, రాజేందర్, అరుణ, మదన్‌గోపాల్, రాంబాబు, సత్యనారాయణ, వెంకటరమణ, సతీశ్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

