‘భద్రాద్రి’లో 70 శాతం
ఉమ్మడి ఖమ్మంవరంగల్నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ భద్రాద్రి జిల్లాలో ప్రశాంతం ముగిసింది. జిల్లాలోని 55 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం 8 గంటలకే ప్రారంభమైన ఓటింగ్.
- జిల్లాలో ప్రశాంతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
- ఓటు హక్కు వినియోగించుకున్న 28,077 మంది గ్రాడ్యుయేట్లు
- ప్రముఖుల్లో ఎమ్మెల్యే కూనంనేని, మాజీ ఎమ్మెల్యేలు రేగా, హరిప్రియ
- టేకులపల్లి పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రియాంక
- పర్యవేక్షించిన ఎంపీ వద్దిరాజు, బీఆర్ఎస్ నేతలు రేగా, వనమా, తాటి
- కాంగ్రెస్ నేతల కక్కుర్తి.. కేంద్రాల్లోకి వచ్చి ఓట్ల కోసం నోట్ల ఎర..
భద్రాద్రి కొత్తగూడెం, మే 27 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఖమ్మంవరంగల్నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ భద్రాద్రి జిల్లాలో ప్రశాంతం ముగిసింది. జిల్లాలోని 55 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం 8 గంటలకే ప్రారంభమైన ఓటింగ్. పది గంటల వరకు మందకొడిగానే సాగింది. అప్పటికే కేవలం 7.74 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.
ఆ తర్వాత ఒక్కరొక్కరుగా పట్టభద్రులు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో పోలింగ్ శాతం పెరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు 10,342 మంది, 2 గంటలకు 18,688 మంది ఓట్లు వేశారు. సాయంత్రం 4 గంటలకు 27,294 మంది ఓట్లు వేశారు. అప్పటికి 68.05 శాతం ఓటింగ్ జరిగింది. మొత్తంగా సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి జిల్లాలో 40,106 మంది ఓటర్లకు గాను 28,077 మంది ఓట్లు వేశారు. మొత్తంగా 70.01 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
టేకులపల్లి పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ తనిఖీ..
జిల్లాలోని టేకులపల్లి పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ప్రియాంక తనిఖీ చేశారు. ఓటింగ్ తీరును పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా అన్ని కేంద్రాల పోలింగ్ సరళినీ పర్యవేక్షించారు. ఎస్పీ రోహిత్‌రాజు కూడా పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి బందోబస్తును పర్యవేక్షించారు.
ఓట్ల కోసం నోట్ల ఎర..
పోలింగ్ సమయంలోనూ కాంగ్రెస్ నాయకులు తమ కక్కుర్తిని ప్రదర్శించారు. గ్రాడ్యుయేట్ల ఓట్ల కోసం నోట్లను ఎరగా చూపారు. ఏకంగా పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చి పట్టభద్రులకు నోట్లు చూపించి మరీ ఓట్లు వేయించుకున్నారు. చివరికి అక్కడికి మీడియా ప్రతినిధులు చేరుకునే సరికి ఉడాయించారు. ఈ తతంగాన్ని ఎన్నికల అధికారులు కూడా పట్టించుకోలేదు. తమకు సమాచారమేమీ లేదంటూ తప్పించుకున్నారు.
ఓటేసిన ప్రముఖులు..
జిల్లాలోని పలువురు ప్రముఖులు తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరకగూడెంలో పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, టేకులపల్లిలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, చుంచుపల్లిలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు ఓటు వేశారు. అధికారులు, ఉద్యోగులు ఎక్కువగా కొత్తగూడెం బాబూక్యాంపులో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ సరళిని పర్యవేక్షించిన బీఆర్ఎస్ నేతలు
భద్రాది జిల్లాలో పోలింగ్ సరళిని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు పరిశీలించారు. కొత్తగూడెం, టేకులపల్లి కేంద్రాల్లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు పోలింగ్ కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, బానోతు హరిప్రియ, తాటి వెంకటేశ్వర్లు తదితరులు ఓటింగ్‌ను పరిశీలించిన పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. కాగా, ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులకు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

