‘మూడో విడత’కు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలో ఈ నెల 17న జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. ఏనూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల పరిధిలో ఉన్న 191 గ్రామ పంచాయతీలు, 1,742 వార్డులకు మూడో విడత ఎన్నికల నిర్వహణకు గతంలో నోటిఫికేషన్ జారీ చేసి, నామినేషన్లు స్వీకరించినట్లు తెలిపారు. మూడో విడతలో ఒక పంచాయతీ, 9 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదని, 22 పంచాయతీలు, 361 వార్డులు ఏకగ్రీవమైనట్లు పేర్కొన్నారు.
- కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, డిసెంబర్ 15 : జిల్లాలో ఈ నెల 17న జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. ఏనూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల పరిధిలో ఉన్న 191 గ్రామ పంచాయతీలు, 1,742 వార్డులకు మూడో విడత ఎన్నికల నిర్వహణకు గతంలో నోటిఫికేషన్ జారీ చేసి, నామినేషన్లు స్వీకరించినట్లు తెలిపారు. మూడో విడతలో ఒక పంచాయతీ, 9 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదని, 22 పంచాయతీలు, 361 వార్డులు ఏకగ్రీవమైనట్లు పేర్కొన్నారు.
మిగిలిన 168 పంచాయతీలకు మొత్తం 485 మంది సర్పంచ్‌లుగా, 1,372 వార్డులకు మొత్తం 3,369 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని తెలిపారు. 2,091 బ్యాలెట్ బాక్సులు, 2,092 పోలింగ్ అధికారులు, 2,637 మంది వోపీవోలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. 31 లొకేషన్స్‌లో 318 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అకడ సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 2,44,283 మంది ఓటర్లు తమ ఓటు హకు వినియోగించుకోనున్నారని, ఇందులో 1,18, 900 మంది పురుషులు, 1,25,380 మంది మహిళలు, ఇతరులు ముగ్గురు ఉన్నట్లు తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

