బీఆర్ఎస్ పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి నియోజవకర్గంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిసున్నారు.
ప్రతి గ్రామానికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తునారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండల పరిధిలోని వెంకటగిరిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రాగా గ్రామస్తులు ఇలా ఆయన్ను గజమాలతో సత్కరించారు.
పినపాక నియోజకవర్గ పరిధిలోని కరకగూడెం మండలంలో ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు ఎన్నికల ప్రచారం నిర్వహిచారు. ప్రచారం మధ్య కాస్త సమయం చిక్కగా ఇలా గ్రామస్తులతో కలిసి సేద తీరారు.
ఎన్నికల ప్రచార గడువు దగ్గరపడుతుండడంతో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రఘునాథపాలెం మండలం ఈర్లపూడి ఎస్సీ కాలనీలో ఆదివారం ఇలా డప్పు కొడుతూ గులాబీ శ్రేణులను ఉత్సాహ పరిచారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఆదివారం పాల్వంచ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణానికి ఆయన చెందిన అభిమానులు ఇలా హారతి ఇచ్చి స్వాగతం పలికారు. తమ వార్డులో నెలకొన్న సమస్యలను వివరించారు.
వేంసూరు మండలంలో ఆదివారం బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య గ్రామగ్రామానికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరించారు. ఓ అవ్వను ఇలా అప్యాయంగా పలకరించి బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు.
అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. ఎమ్మెల్యే అభ్యర్థి నియోజకవర్గ పరిధిలోని ప్రతి మారుమూల గ్రామానికీ వెళ్తున్నారు. ఆదివారం మందలపల్లి సాయిబాబా మందిరంలో తన గెలుపును కాంక్షిస్తూ పూజలు చేశారు.
వైరా నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆదివారం వైరా పట్టణంలో ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌లాల్ ఇలా డప్పు కొడుతూ.. నృత్యం చేస్తూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అజయ్‌కుమార్ గెలుపు కోసం ఆయనసతీమణి వసంతలక్ష్మి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆదివారం ఖమ్మం నగరంలో పార్టీ మ్యానిఫెస్టోను వివరిస్తూ కనిపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలంలో మహిళలు ఇలా ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఇల్లెందు నియోజకవర్గంలో ఊరూరా గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. పార్టీ శ్రేణులు మారుమూల గిరిజన గూడేలకూ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వారితో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి హరిప్రియానాయక్ ఇంటింటికీ వెళ్తున్నారు. ఆదివారం ఇల్లెందు మండలంలో ఇలా జై..కొడుతూ కనిపించారు.
బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్‌రాజు ఎన్నికల గెలుపు కోసం అలుపెరుగకుండా పనిచేస్తున్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం మధిరలో ప్రచారం చేస్తూ కనిపించారు.