క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఖమ్మం నగరంలో ఎక్కడ చూసినా సందడి.. సందడిగా మారింది. చర్చిలన్నీ రంగురంగుల విద్యుత్‌దీపాలు, స్టార్స్‌తో ముస్తాబయ్యాయి. బుధవారం జరుగనున్న క్రిస్మస్ వేడుకల కోసం కేకులు ఆర్డర్ ఇచ్చేందుకు స్వీటు షాపులు కిటకిటలాడాయి.
క్రైస్తవుల షాపింగ్‌తో వస్త్ర దుకాణాలు నిండిపోయాయి. నగరంలోని కమాన్‌బజార్, కస్బాబజార్, వైరారోడ్, ఇల్లెందు రోడ్డు, ఎన్ఎస్టీ రోడ్డు, స్టేషన్‌రోడ్డులోని ఫ్యాన్సీషాపుల్లో క్రిస్మస్ ట్రీ, స్టార్స్, డెకరేషన్ మెటీరియల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పలుచోట్ల ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. – ఖమ్మం, డిసెంబర్ 23