కారేపల్లి, సెప్టెంబర్ 21 : సింగరేణి మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వల్లభనేని గురవయ్య (85) సోమవారం ఉదయం మృతి చెందాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గురవయ్య ఖమ్మం పట్టణంలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్వగ్రామం విశ్వనాధపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మండల నాయకులు ముత్యాల సత్యనారాయణ, రావూరి శ్రీనివాసరావు, ఉన్నo వీరేందర్, ముత్యాల వెంకట అప్పారావు, పాట వెంకన్న గురవయ్య మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపి కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు.