బీఆర్ఎస్ నాయకుల సంబురాలు
వైరా బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
- ఆలయాలు, మసీదులు, చర్చిల్లోబీఆర్ఎస్ శ్రేణుల ప్రత్యేక పూజలు
- బీ ఫారం అందుకున్న బానోత్ మదన్‌లాల్
కొణిజర్ల, అక్టోబర్15: వైరా బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా మదన్‌లాల్ బీ ఫారం అందుకుంటున్న సందర్భంగా పూజలు నిర్వహించారు.
కారేపల్లి, అక్టోబర్ 15 : ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ ఆలయంలో ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉసిరికాయలపల్లి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి మదన్‌లాల్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆదివారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బానోత్ మదన్‌లాల్ భీ పారం అందుకోవడాన్ని హర్షిస్తూ కారేపల్లిలో బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ గ్రామశాఖల ఆధ్వర్యంలో ఆలయాల్లో మదన్‌లాల్ గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేశారు.

వైరాటౌన్, అక్టోబర్15 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రకటించిన మేనిఫెస్టోకు విశేష స్పందన లభిస్తోంది. నియోజకవర్గ కేంద్రమైన వైరా రింగురోడ్డు సెంటర్లో బాణసంచాకాల్చి హర్షాన్ని వ్యక్తం చేశారు.
వైరాటౌన్, అక్టోబర్15 : వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ విజయాన్ని కాంక్షిస్తూ వైరాలోని మసీదులు, చర్చీలు, ఆలయాల్లో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మద్దెల రవి మాట్లాడుతూ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని కోరారు.
వైరారూరల్, అక్టోబర్15 : వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ విజయాన్ని కాంక్షిస్తూ గ్రామపంచాయతీల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఆలయాల్లో, చర్చీల్లో, మసీదుల్లో ఆదివారం పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు పలు గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం ప్రారంభంలో పాల్గొన్నారు.
గొల్లెనపాడు గ్రామంలో మేడూరు రామారావు, కిలారి శ్రీనివాసరావు ప్రచారాన్ని ప్రారంభించారు. సిరిపురం, పుణ్యపురం, నారపనేనిపల్లి, విప్పలమడక, లింగన్నపాలెం, గరికపాడు, దాచాపురం, గన్నవరం, గోవిందాపురం, పాలడుగు, వల్లాపురం, అష్ణగుర్తి, రెబ్బవరం తాటిపూడి, స్టేజిపినపాక గ్రామాల్లో ప్రచారం ప్రారంభం చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

