టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
విజయవాడ–జగదల్పూర్ జాతీయ రహదారి-30పై రుద్రంపూర్–పెనగడప పంచాయతీల మధ్య ఏర్పాటు చేసిన ట్రక్ లే-బైలో లారీ డ్రైవర్లకు కనీస సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వాహనాల నుండి టోల్ టాక్స్ వసూలు చేస్తున్నప్పుడు...
– ట్రక్ లే-బైలో నీటి కొరత.. నిరుపయోగంగా మరుగుదొడ్లు
– వెలగని వీధి దీపాలతో లారీ డ్రైవర్లకు ఇబ్బందులు
రుద్రంపూర్, అక్టోబర్ 26 : విజయవాడ–జగదల్పూర్ జాతీయ రహదారి-30పై రుద్రంపూర్–పెనగడప పంచాయతీల మధ్య ఏర్పాటు చేసిన ట్రక్ లే-బైలో లారీ డ్రైవర్లకు కనీస సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వాహనాల నుండి టోల్ టాక్స్ వసూలు చేస్తున్నప్పుడు, డ్రైవర్లకు అవసరమైన వసతులను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ట్రక్ లే-బైలోని మరుగుదొడ్లు, స్నానపు గదులు వినియోగానికి అనువుగా లేవని, నీటి సరఫరా, నిర్వహణపై సమస్యలు ఉన్నాయని వాహనదారులు చెబుతున్నారు. దీంతో సుదూర ప్రయాణాలు చేసే లారీ డ్రైవర్లు కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానం చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు, విశ్రాంతి గదుల వినియోగంపై కూడా స్పష్టత అవసరమవుతోంది. రాత్రివేళ వీధి దీపాలు వెలగకపోవడంతో లారీలు నిలిపే ప్రాంతం చీకటిగా మారి, వాహనాల రాకపోకల సమయంలో ప్రమాదాలపై ఆందోళన నెలకొంటోంది. డ్రైవర్ల విశ్రాంతి, పారిశుధ్యం, భద్రత కోసం ఏర్పాటు చేసిన ట్రక్ లే-బైలోనే ఇలాంటి సమస్యలు ఉంటే దాని ప్రయోజనం ఏమిటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత జాతీయ రహదారుల సంస్థ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, మరుగుదొడ్లు, స్నానపు గదులకు నీటి సరఫరా, విశ్రాంతి గదుల నిర్వహణ, వీధి దీపాల మరమ్మతులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

