ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతి.. మృతుల్లో మహిళా నక్సలైట్!
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టు అగ్ర నాయకులు ఉన్నట్లు సమాచారం అందడంతో కోబ్రా, డీఅర్జీ, జిల్లా బలగాల సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
కొత్తగూడెం ప్రగతి మైదాన్, మార్చి 1: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టు అగ్ర నాయకులు ఉన్నట్లు సమాచారం అందడంతో కోబ్రా, డీఅర్జీ, జిల్లా బలగాల సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో తారసపడ్డ మావోయిస్టులు భద్రతాబలగాలపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన సుమారు 500 మందితో కూడిన భద్రతా దళాలు నలుదిక్కుల నుంచి మావోయిస్టులను చుట్టుముట్టాయి.
మావోయిస్టుల కాల్పులతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఇరు వర్గాల మధ్య నాలుగు విడతలుగా కాల్పులు జరిగాయి. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గంలో పారిపోయారు. కాల్పుల విరమణ అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టులతో పాటు వారికి సంబంధించిన మారణాయుధాలు, ఇతర వస్తు, సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనపరుచుకున్నాయి. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు ఉన్నట్లు సమాచారం. భద్రత దళాలు ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం ముమ్మరంగా గాలింపులు చేపడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

