‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
తెలంగాణ ఆడపడుచులు అత్యంత వైభవంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో సింగరేణి కొత్తగూడెం ఏరియా అధికారులు వివక్ష చూపుతున్నారని రుద్రంపూర్ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు ఉమ్మడి సాగర్ విమర్శించారు. శనివారం ఏరియా పరిధిలోని ప్రగతివనం వద్ద...
రుద్రంపూర్, అక్టోబర్ 17 : తెలంగాణ ఆడపడుచులు అత్యంత వైభవంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో సింగరేణి కొత్తగూడెం ఏరియా అధికారులు వివక్ష చూపుతున్నారని రుద్రంపూర్ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు ఉమ్మడి సాగర్ విమర్శించారు. శనివారం ఏరియా పరిధిలోని ప్రగతివనం వద్ద ఉన్న ధన్బాద్ చెరువు బతుకమ్మ ఘాట్లను ఆయన ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బతుకమ్మ నిమజ్జనానికి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చే ధన్బాద్ చెరువులో ఒక ఘాట్ వద్ద మాత్రమే చెత్త తొలగించారని, రెండో ఘాట్ వద్ద ఇంకా శుభ్రత పనులు చేపట్టలేదని తెలిపారు. గతేడాది మాదిరిగా ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉంటే బాగుండేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్థానిక నాయకుల సలహాలు, సూచనలు తీసుకొని రెండు ఘాట్ల వద్ద శుభ్రత పనులు పూర్తి చేయాలని, మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సద్దుల బతుకమ్మ నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధన్బాద్ మాజీ ఉపసర్పంచ్ రవి, బావు సతీష్, పూల రవీందర్, ఐలయ్య, మంద జయరాజు, ముకేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

