‘నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు’
వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులను మోసగించేలా నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్ హెచ్చరించారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
– జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్ హెచ్చరిక
జూలూరుపాడు, జూన్ 24 : వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులను మోసగించేలా నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్ హెచ్చరించారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విత్తనాలు, ఎరువులు విక్రయించే ప్రతి వ్యాపారి విధిగా వ్యవసాయ శాఖ జారీ చేసిన అధీకృత లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. దుకాణాల్లో ఉన్న స్టాక్ వివరాలను ప్రతిరోజూ రికార్డుల్లో నమోదు చేయడంతో పాటు కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన బిల్లులు, స్టాక్ రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలన్నారు. ఎంఆర్పీకి మించి అధిక ధరలకు విక్రయించరాదని, రైతులు కోరిన విత్తనాలను మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే అధీకృత దుకాణాల్లో నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు ప్రతి దానికి తప్పనిసరిగా రసీదు అడిగి తీసుకోవాలన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఉద్యోగాలపై నిలదీస్తే దాడులు చేస్తారా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Mens Fitness | పురుషుల ఫిట్నెస్ అంటే కేవలం కండరాలను పెంచుకోవడమే కాదు, ఇవి కూడా..!
Gadwal ADE | కాంట్రాక్టర్ నుంచి రూ.60వేలు లంచం.. గద్వాల ఏడీఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
Chemicals | మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్న రసాయనాలు.. చర్యలు తీసుకోకపోతే మరిన్ని సమస్యలు తప్పవు..
ACB Raid | కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏడీఈ
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

