‘ఏఐటీయూసీ పోరాట ఫలితం.. పీవీకే-5 కార్మికులకు సర్ఫేస్ కన్వర్షన్’
కొత్తగూడెం ఏరియాలోని పీవీకే-5 ఇంక్లైన్ భూగర్భ గనిలో విధులు నిర్వహిస్తున్న జనరల్ అసిస్టెంట్ కార్మికులకు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ కన్వర్షన్‌కు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ చేసిన నిరంతర పోరాటం, యాజమాన్యంపై తీసుకువచ్చిన ఒత్తిడి ఫలితంగా...
– ఈ నెల 17న సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ కౌన్సెలింగ్ నిర్వహణకు యాజమాన్యం అంగీకారం
– కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి జక్కుల గట్టయ్య
రుద్రంపూర్, నవంబర్ 12 : కొత్తగూడెం ఏరియాలోని పీవీకే-5 ఇంక్లైన్ భూగర్భ గనిలో విధులు నిర్వహిస్తున్న జనరల్ అసిస్టెంట్ కార్మికులకు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ కన్వర్షన్‌కు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ చేసిన నిరంతర పోరాటం, యాజమాన్యంపై తీసుకువచ్చిన ఒత్తిడి ఫలితంగా ఈ నెల 17వ తేదీన సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు యాజమాన్యం అంగీకరించిందని కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి జక్కుల గట్టయ్య గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎన్నో సంవత్సరాలుగా సర్ఫేస్ కన్వర్షన్ కోసం ఎదురుచూస్తున్న భూగర్భ గని కార్మికుల ఆశలు ఎట్టకేలకు నెరవేరబోతున్నాయని, ఇది కార్మికుల ఐక్యతకు, ఏఐటీయూసీ పోరాట పటిమకు దక్కిన విజయమని ఆయన పేర్కొన్నారు. మొదట సింగరేణి వ్యాప్తంగా సీనియారిటీ జాబితా ఆధారంగా సర్ఫేస్ కన్వర్షన్ చేపట్టాలని యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేసిందని, అయితే ఈ విధానం వల్ల పీవీకే-5 పద్మావతి భూగర్భ గనిలో పనిచేస్తున్న కార్మికులకు అన్యాయం జరుగుతుందని గుర్తించిన ఏఐటీయూసీ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిందని గట్టయ్య తెలిపారు.
ముందుగా పద్మావతి భూగర్భ గనిలో పనిచేస్తున్న కార్మికులకు ప్రాధాన్యతనిస్తూ సర్ఫేస్ కన్వర్షన్ చేపట్టాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశామని తెలిపారు. ఏఐటీయూసీ ఒత్తిడితో యాజమాన్యం గతంలో విడుదల చేసిన సర్క్యులర్‌ను రద్దు చేసిందని పేర్కొన్నారు. ఆ తర్వాత సర్ఫేస్ టు సర్ఫేస్ కార్మికుల బదిలీల ప్రక్రియ చేపట్టి, ఆ ప్రక్రియ అనంతరం మిగిలే ఖాళీలను అండర్‌గ్రౌండ్ కార్మికులతో సర్ఫేస్ కన్వర్షన్ ద్వారా భర్తీ చేస్తామని యాజమాన్యం మరో సర్క్యులర్ విడుదల చేసిందని తెలిపారు. ఈ విధానం వల్ల కూడా భూగర్భ గని కార్మికులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని భావించిన ఏఐటీయూసీ ఆ నిర్ణయాన్ని సైతం వ్యతిరేకిస్తూ కార్మికుల హక్కుల కోసం తన పోరాటాన్ని కొనసాగించిందన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ఎదుట భారీ ఎత్తున నిరాహార దీక్షలు నిర్వహించామని, పలుమార్లు డైరెక్టర్లకు, జనరల్ మేనేజర్‌కు వినతిపత్రాలు సమర్పించి కార్మికుల న్యాయమైన డిమాండ్‌ను బలంగా వినిపించామని గట్టయ్య వివరించారు. యాజమాన్యం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు కార్మికుల పక్షాన నిలబడి వివిధ రూపాల్లో ఉద్యమాన్ని కొనసాగించామని తెలిపారు.
ఈ నిరంతర పోరాటాల ఫలితంగానే ఈ నెల 17వ తేదీన సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు యాజమాన్యం అంగీకరించిందని, ఈ ప్రక్రియ ద్వారా సుమారు 145 పోస్టులను సాధించుకోవడం ఏఐటీయూసీ ఉద్యమ విజయానికి నిదర్శనమని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భూగర్భ గని జనరల్ అసిస్టెంట్ కార్మికులకు ఈ పరిణామం ఎంతో ఆనందాన్ని, నూతన ఆశలను కలిగించిందని జక్కుల గట్టయ్య అన్నారు. కార్మికుల సమస్యలను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, నిరంతర పోరాటాల ద్వారా పరిష్కారం దిశగా తీసుకెళ్లడమే ఏఐటీయూసీ లక్ష్యమని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణలో, వారి న్యాయమైన సమస్యల పరిష్కారంలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఎల్లప్పుడూ ముందుంటుందని, భవిష్యత్‌లోనూ కార్మికుల సంక్షేమం కోసం రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఏఐటీయూసీ పోరాట ఫలితం.. పీవీకే-5 కార్మికులకు సర్ఫేస్ కన్వర్షన్’
Out Side Food | బయటి ఆహారం తక్కువగా తినాలి లేదా పూర్తిగా మానేయాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Rajnath Singh | ముప్పు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. సైన్యానికి రక్షణ మంత్రి పిలుపు
‘గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించే వరకు పోరాటం’
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

