– 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు
ఆళ్లపల్లి, ఫిబ్రవరి 04 : అతివేగంతో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన ఆళ్లపల్లి మండలంలో బుధవారం జరిగింది. ఎస్ఐ ఎం. సోమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి మర్కోడు పంచాయతీ కిచనపల్లి గ్రామానికి చెందిన పడిగ సూర్యప్రకాష్ ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్తున్నాడు. పాతూరు గ్రామంలోని మూలమలుపు వద్దకు రాగానే అతివేగంతో ట్రాక్టర్ తిప్పడంతో అదుపుతప్పి సూర్యప్రకాష్పైనే బోల్తా పడింది. అదే సమయంలో కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగించుకుని ఆళ్లపల్లి మీదుగా తన స్వగ్రామం కరకగూడెం వెళ్తున్న బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ట్రాక్టర్ బోల్తా పడిన విషయాన్ని గమనించారు. 108 అంబులెన్సన్కు సమాచారం అందించి స్థానికుల సహాయంతో ట్రాక్టర్ ను జేసీబీతో పక్కకు తీపించారు. క్షతగాత్రుడిని చికిత్స కోసం 108లో కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. రేగా మానవత్వంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

అతివేగంతో ట్రాక్టర్ బోల్తా.. క్షతగాత్రుడిని రెస్క్యూ చేసిన రేగా కాంతారావు