కొత్తగూడెం అర్బన్, మే 13 : హైదరాబాద్లో జరుగుతున్న అందాల పోటీలను అడ్డుకుంటారనే నెపంతో పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్యను గృహ నిర్బంధం చేయడం అమానుషమని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అన్నారు. సంధ్యను గృహ నిర్భంధం చేయడాన్ని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామికంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఏడవ హక్కుగా ప్రకటించిన ప్రజాస్వామ్యపు హక్కును హరించడమేనని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాలు ప్రశ్నించే నాయకులని గృహ నిర్బంధం పేరుతో బెదిరించడాన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలన్నారు. సంధ్య ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు తక్షణమే ఇంటి నుండి బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.