ముంపు ప్రాంతాల్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం పర్యటన
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే బ్యాక్ వాటర్‌తో తెలంగాణలోని గోదావరి తీరప్రాంతాల్లో ప్రభావం కలిగించే పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం (పీపీఏ) బుధవారం మండలంలో పర్యటించింది. తొలుత ఐటీసీ గెస్ట్‌హౌజ్ చేరుకున్న బృందం..
బూర్గంపహాడ్, జూన్ 03 : పోలవరం ప్రాజెక్టు పూర్తయితే బ్యాక్ వాటర్‌తో తెలంగాణలోని గోదావరి తీరప్రాంతాల్లో ప్రభావం కలిగించే పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం (పీపీఏ) బుధవారం మండలంలో పర్యటించింది. తొలుత ఐటీసీ గెస్ట్‌హౌజ్ చేరుకున్న బృందం స్థానికంగా ఉన్న కేంద్ర జలసంఘం, నీటి పారుదల విభాగం అధికారులతో సమీక్షించి అనంతరం బూర్గంపహాడ్ మండలంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని కొల్లు ప్రాంతంతో పాటు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామాల్లో రెండు ప్రాంతాల్లో పర్యటించి ముంపునకు గల కారణాలపై అధ్యయనం చేశారు. అదేవిధంగా అశ్వాపురంలోని హెవీ వాటర్ ప్లాంట్‌ను బృందం సందర్శించి అక్కడ వరద ప్రవాభం ఏ మేరకు ఉందో అక్కడి వారిని అడిగి తెలుసుకుని అధ్యయనం చేశారు.
పోలవరం బ్యాక్ వాటర్ ముంపు ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుందో ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ అధ్యయనం చేశారు. పోలవరం బ్యాక్ వాటర్ తో ప్రధానంగా బూర్గంపహాడ్, అశ్వాపురం మండలాలకు సమస్య ఉందని, అటు భద్రాచలం, దుమ్ముగూడెం ప్రాంతాల్లో బ్యాక్ వాటర్ ప్రభావం ఎక్కువగా ఉండి ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఎక్కువగా ఉన్నట్లు బృందం గుర్తించినట్లు తెలుస్తోంది. పరిశీలన చేసిన బృందంలో పీపీఏ సీఈఓ సంజీవ్ వోహ్రా, ఎంఎస్ రఘురాం, సీఈ రమేశ్, డైరెక్టర్ సతీష్, డిప్యూటీ డైరెక్టర్లు ప్రవీణ్, రవి, శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ ఎస్ఈ సుబ్రమణ్యప్రసాద్, ఈఈలు వెంకటేశ్వరరావు, మమ్మద్ జాని, డీఈలు శ్రీనివాస్, మధుసూదన్‌రావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

