MLA | విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలి : వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్

జూలూరుపాడు: అంగన్వాడీ కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు, చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండల పరిధిలోని అన్నారుపాడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, పడమటనర్సాపురం గ్రామంలోని గిరిజన ఆశ్రమ ఉన్నతపాఠశాలను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలోని సరుకులను పరిశీలించారు. అంగన్వాడీకి వస్తున్న పిల్లల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సమయపాలన పాటిస్తూ మెనూ ప్రకారం విద్యార్ధులకు పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. ఆశ్రమ పాఠశాలలోని రికార్డులను పరిశీలించి, తరగతి గదులకు వెళ్లి విద్యార్ధునుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా వీరి వెంట ఎంపీవో రామారావు, అన్నారుపాడు సర్పంచ్ పద్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చౌడం నర్సింహారావు, నాయకులు నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
- Tags
- anganawadi
- Inspection
- wyra
- wyra mla
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

