దమ్మపేట, జూలై 20 : దమ్మపేట మండలం కొమ్ముగూడెం మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు సోయం రాజా బాబు మృతిపట్ల మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొమ్ముగూడెంలోని ఆయన నివాసానికి చేరుకుని పార్థివదేహానికి నివాళులర్పిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం, పార్టీ కోసం సోయం రాజాబాబు సేవలను గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
నివాళులు అర్పించిన వారిలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, సొసైటీ మాజీ చైర్మన్ రావు జోగేశ్వరరావు, మాజీ జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు దారా యుగంధర్, ఒగ్గెల పూజ, సోయం వీరభద్రం, రావుల శ్రీనివాసరావు, జలగం వాసు, అబ్దుల్ జీన్న, బెక్క వెంకటేశ్వరరావు, దారా యుగంధర్, పెద్దగొల్లగూడెం సర్పంచ్ యాట్ల రాందాస్, నారం రాజ్ శేఖర్, గాజుబోయిన యేసుబాబు, రావుల శ్రీను, జలగం వాసు, అబ్దుల్ జిన్నా, రామకృష్ణ, చీకటి రామయ, యార్లగడ్ శ్రీను, భరత్, గుమ్మడపు విష్, మండవ సత్య, బాల శ్రీను, సున్నం రాము, వెలుగోటి మహేష్, తోలెం మల్లేష్ ఉన్నారు.