‘సర్టిఫికెట్ల లేమితో ఉన్నత విద్యకు మదర్సా విద్యార్థులు దూరం’
ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో మదర్సాలలో ఆధ్యాత్మిక విద్యను అభ్యసించిన అనేక మంది విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్ల లేమి కారణంగా వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందలేక అవకాశాలను కోల్పోతున్నారని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా..
– మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్ పాషా
– మదర్సా విద్యార్థులకు ప్రవేశాల్లో ప్రత్యేక మినహాయింపులు కల్పించాలి
రుద్రంపూర్, జూన్ 06 : ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో మదర్సాలలో ఆధ్యాత్మిక విద్యను అభ్యసించిన అనేక మంది విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్ల లేమి కారణంగా వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందలేక అవకాశాలను కోల్పోతున్నారని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన షేక్ మదీనా అనే విద్యార్థిని 8 సంవత్సరాల పాటు మదర్సాలో ఆలీమ్ కోర్సు అభ్యసించి, అనంతరం సార్వత్రిక విద్యా విధానం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిందని తెలిపారు. ఉపాధ్యాయ శిక్షణ (టీచర్ ట్రైనింగ్) పొందాలనే లక్ష్యంతో టీజీ డీఈఈసెట్ ప్రవేశ పరీక్ష రాసి రాష్ట్ర స్థాయిలో 339వ ర్యాంక్ సాధించినప్పటికీ, శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కౌన్సిలింగ్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు లేకపోవడంతో సీటు కోల్పోయిందన్నారు.
సార్వత్రిక విధానం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు స్టడీ సర్టిఫికెట్లు ఎవరు జారీ చేస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మదర్సా విద్యార్థులకు ప్రతిభ ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో ఉన్నత విద్యావకాశాలను కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, మదర్సా విద్యార్థులకు కౌన్సిలింగ్‌లు, ప్రవేశాల సమయంలో ప్రత్యేక వెసులుబాట్లు కల్పించే విధంగా అవసరమైన మార్గదర్శకాలు జారీ చేసి వారి విద్యా భవిష్యత్‌కు భరోసా కల్పించాలని యాకూబ్ పాషా ప్రభుత్వాన్ని కోరారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

