‘బుడ్డగూడెం’ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా
కిన్నెరసాని వాగు నుండి బుడ్డగూడెం కేంద్రంగా ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. కిన్నెరసాని వాగులో జేసీబీల సహాయంతో పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా రాత్రనకా, పగలనకా అక్రమ రవాణాను ఇసుక మాఫియా యధేచ్చగా సాగిస్తుంది. రాత్రి 10 గంటలు దాటాక...
– రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు జోరుగా రవాణా
– సమాచారం తెలిసినా కదలని పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖలు
బూర్గంపహాడ్, నవంబర్ 10 : కిన్నెరసాని వాగు నుండి బుడ్డగూడెం కేంద్రంగా ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. కిన్నెరసాని వాగులో జేసీబీల సహాయంతో పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా రాత్రనకా, పగలనకా అక్రమ రవాణాను ఇసుక మాఫియా యధేచ్చగా సాగిస్తుంది. రాత్రి 10 గంటలు దాటాక అక్రమ వ్యాపారానికి గేట్లు తెరుస్తూ తెల్లవారుజామున 6 గంటల వరకు పదుల సంఖ్యలో ట్రాక్టర్ల రణగొణధ్వనుల మధ్య కిన్నెరసాని వాగు నుండి బుడ్డగూడెం గ్రామం మీదుగా ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది.
ఇద్దరు వ్యక్తుల కనుసన్నల్లో దందా
బూర్గంపహాడ్ మండల పరిధిలోని బుడ్డగూడెం గ్రామంలో ఇద్దరు వ్యక్తుల కనుసన్నల్లోనే అక్రమ ఇసుక వ్యాపారం జోరుగా సాగుతుందనేది బహిరంగ సత్యమే. కిన్నెరసాని వాగు నుండి ఆ ఇద్దరు వ్యక్తులు అధికార పార్టీకి చెందిన కొందరు నేతల అండదండలతో ఈ ఇసుక వ్యాపారాన్ని మూడు ట్రాక్టర్లు.. ఆరు లారీలు అన్న చందంగా ధనార్జనే ధ్యేయంగా సాగిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా వరదల సమయంలో మినహా ఈ ప్రాంతంలో 365 రోజులు సాగుతుంది. ఇసుక మాఫియా నిర్వాహకులు ఎవడైతే మాకేంటి… మమ్మలను ఆపేది ఎవడు.. ఎవరికి చేరాల్సింది వారికి చేరుతుందనే కోణంలో ఈ వ్యాపారాన్ని యధేచ్ఛగా సాగిస్తున్నారు. సోషల్ మీడియా గ్రూపుల్లో ఇసుక అక్రమ రవాణాపై సమాచారం ఇస్తే దానికి ఆ ఇసుక మాఫియా వ్యక్తులు లైక్‌లు సైతం కొడుతూ మమ్మల్ని ఆపేదెవరనేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు.
కట్టడిలో అధికార యంత్రాంగం విఫలం
బుడ్డగూడెం అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేసే విషయంలో మండలంలోని పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖలు ఘోరంగా విఫలమయ్యాయనే ఆరోపణలు ప్రజల నుండి వినవస్తున్నాయి. అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి సోషల్ మీడియా, పలు వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం ఇస్తున్నా, అధికారులకు సమాచారం చేరవేస్తున్నా సంబంధిత శాఖల అధికారులు అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు బాహాటంగానే వినవస్తున్నాయి. మరోవైపు ఇసుక రవాణాకు సంబంధించి అధికారులు ముడుపులు తీసుకున్నారా అనే అనుమానాలను సైతం వ్యక్తం చేస్తున్నారు. బుడ్డగూడెం అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి జిల్లా స్థాయి అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు స్పందించి ఇసుక అక్రమార్కుల భరతం పట్టాలని మండల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బుడ్డగూడెం’ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా
Drinking Water | నిజామాబాద్ శివారులో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు.. వీడియో
Anna Lezhneva | పవన్ కళ్యాణ్- అన్నా లెజినోవా వైవాహిక బంధంపై చర్చ.. ఆమె ఆస్తులు 18వేల కోట్లా..!
Matrimonial Dispute: భార్యాభర్తల గొడవ.. భారత మహిళ నుంచి వాంగ్మూలం తీసుకోనున్న కివీస్ పోలీసులు
‘చదువుకో తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

