భద్రాచలం, ఏప్రిల్ 08 : భధ్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పిల్లల వైద్య నిపుణుడిగా పని చేస్తున్న డాక్టర్ క్రాపా విజయ్ ఉత్తమ వైద్య సేవలకు గాను రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్న సందర్భంగా బుధవారం ఆయనను యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఈ గౌరవం ఆయన వ్యక్తిగత ప్రతిభకు మాత్రమే కాకుండా, భద్రాచలం ప్రాంతానికి కూడా గర్వకారణంగా నిలిచిందన్నారు. భవిష్యత్‌లో ఆయన సేవలు మరింత విస్తరించి, సమాజానికి మరిన్ని మేలు చేకూర్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి విజయ్‌కుమార్, అధ్యక్షుడు కొమరం కొమరం శ్రీనివాస్, కన్వీనరు టీవీఎస్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పీఎస్వీ ప్రసాద్‌బాబు, ట్రెజరర్ ఆశలత, కన్వీనర్ సైదులు, సీనియర్ నాయకులు రాజా శ్రీనివాస్, మండల బాధ్యులు జి.వెంకటేశ్వర్లు, తులసీరామ్ పాల్గొన్నారు.