గోదావరి పరవళ్లు : భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ
godavari flood | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తుతున్నది. నదిలో నీటిమట్టం గంట గంటకూ పెరుతున్నది.

హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తుతున్నది. నదిలో నీటిమట్టం గంట గంటకూ పెరుతున్నది. శనివారం సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇండ్లలోకి వరద నీరు చేరే వరకు వేచిచూడకుండా తక్షణమే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ముంపు బాధితులను కోరారు. ప్రజలంతా అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
గోదావరి పరవళ్లు తొక్కుతుండటంతో వరద నీరు పర్ణశాలను చుట్టుముట్టింది. పర్ణశాలలోని సీతమ్మ విగ్రహం, నారచీరల ప్రాంతం పూర్తిగా నీటమునిగాయి. కేవలం 24 గంటల వ్యవధిలో నది నీటిమట్టం 20 అడుగులకుపైగా పెరిగింది. ప్రవాహం ఇలానే కొనసాగితే 60 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

