సర్పంచ్ నవీన్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
కారు డోర్ లాక్ అయి ప్రాణాలు కోల్పోయిన వినోబా నగర్ గ్రామ సర్పంచ్ గంగావత్ నవీన్ కుమార్తె, చిన్నారి 'తన్వితశ్రీ' మృతి అత్యంత బాధాకరమని వైరా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోత్ చంద్రావతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జూలూరుపాడు మండల పరిధిలోని...
– చిన్నారి తన్వితశ్రీ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి
– అండగా ఉంటామని భరోసా
జూలూరుపాడు, సెప్టెంబర్ 21 : కారు డోర్ లాక్ అయి ప్రాణాలు కోల్పోయిన వినోబా నగర్ గ్రామ సర్పంచ్ గంగావత్ నవీన్ కుమార్తె, చిన్నారి ‘తన్వితశ్రీ’ మృతి అత్యంత బాధాకరమని వైరా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోత్ చంద్రావతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జూలూరుపాడు మండల పరిధిలోని వినోబా నగర్ గ్రామంలోని సర్పంచ్ నవీన్ నివాసానికి వెళ్లిన ఆమె బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, చిన్నారి అకాల మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి ఊహించని విషాద సమయంలో కన్నవారిని మాటలతో ఓదార్చడం ఎవరికైనా కష్టమే అన్నారు.
పసిబిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల గర్భశోకం వర్ణనాతీతం అని, ఈ తీరని శోకాన్ని తట్టుకునే గుండె ధైర్యాన్ని భగవంతుడు ఆ కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటా అని భరోసా ఇచ్చారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందిన అన్నారుపాడు సర్పంచ్ భూక్యా ప్రసాదును వారి గ్రామానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నగేశ్, గంగావత్ గోరియా, బానోత్ రవి, గంగావత్ లింగ, భూక్యా చందు, మాలోత్ నాగేశ్వరరావు, గంగావత్ రవి, గంగావత్ నరేంద్ర, గంగావత్ ప్రసాద్, బానోత్ రామ, బానోత్ పంతులు, బానోత్ నాన్య పాల్గొన్నారు.

సర్పంచ్ నవీన్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

