ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామ పంచాయతీ నిర్వహణ బేష్ అంటూ డీపీవో అనూష సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గాన్ని ప్రశంసించారు. సోమవారం మండలంలోని ఇరవెండి పంచాయతీలో పర్యటించిన ఆమె పల్లె ప్రకృతివనం, డంపింగ్, కంపోస్ట్...
– పల్లె ప్రకృతివనం, డంపింగ్, కంపోస్ట్ పిట్ల పరిశీలన
బూర్గంపహాడ్, అక్టోబర్ 26 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామ పంచాయతీ నిర్వహణ బేష్ అంటూ డీపీవో అనూష సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గాన్ని ప్రశంసించారు. సోమవారం మండలంలోని ఇరవెండి పంచాయతీలో పర్యటించిన ఆమె పల్లె ప్రకృతివనం, డంపింగ్, కంపోస్ట్ పిట్లను పరిశీలించి వాటి పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి అంటే కేవలం రహదారులు, భవనాల నిర్మాణమే కాదన్నారు. పరిశుభ్రమైన పరిసరాలు, పచ్చదనంతో నిండిన ప్రకృతివనం, తడి, పొడి చెత్త నిర్వహణ, వ్యర్ధాల నుండి సేంద్రియ ఎరువు తయారీ వంటి అంశాల సమన్వయమే నిజమైన పల్లెప్రగతికి నిదర్శనమని, ఈ దిశగా పంచాయతీలో చేపడుతున్న నిర్వహణ పనులను ఆమె ప్రశంసించారు. సర్పంచ్ గుండె బాబూరావు, ఉపసర్పంచ్ మహంకాళి రామారావులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట కార్యదర్శి స్పందన ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

