ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సిబ్బందికి డీఎంహెచ్ఓ తుకారం రాథోడ్ సూచనలు
చుంచుపల్లి మండలం పెనగడప వైద్య ఆరోగ్య కేంద్రాన్ని శనివారం డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రతాప్తో కలిసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DM&HO) డాక్టర్ తుకారం రాథోడ్ పరిశీలించి విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా...
– పెనగడప వైద్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
చుంచుపల్లి, ఆగస్టు 22 : చుంచుపల్లి మండలం పెనగడప వైద్య ఆరోగ్య కేంద్రాన్ని శనివారం డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రతాప్తో కలిసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DM&HO) డాక్టర్ తుకారం రాథోడ్ పరిశీలించి విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ప్రయోగశాల, ఫార్మసీ, వార్డు, ఐఎల్ఆర్ (ILR) తదితర విభాగాలను పరిశీలించారు. రికార్డులు, హాజరు రిజిస్టర్, సెలవు వివరాలు, వివిధ లేఖలు తదితర పత్రాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. అనంతరం పెనగడప గ్రామంలో నిర్వహించిన దోమల నివారణ మందు పిచికారీ కార్యక్రమంలో అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు గ్రామాల్లో పారిశుధ్యం, దోమల నియంత్రణ చర్యలు నిరంతరం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెనగడప వైద్య ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

