ఇల్లెందు, మే 11 : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఇల్లెందు పట్టణంలోని తన కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి అయి ఉండి తన కుమారుడు బాలికపై చేసిన అఘాయిత్యాన్ని చూస్తూ కుమారుడిని కాపాడుతున్న బండి సంజయ్ ని సైతం వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని, అతడి కుమారుడిని అరెస్టు చేయాలన్నారు.
అలాగే ఈ ఘటనలో పోలీసు అధికారుల నిర్లక్ష్యానికి గాను ఎస్హెచ్ఓని సస్పెండ్ చేయాలని, ఇంత జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఏం పట్టనట్టుగా వ్యవహరించడంపైరన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎస్.రంగనాథ్, అబ్దుల్ నబీ, చీమల సత్యనారాయణ, సువర్ణపాక సత్యనారాయణ, కృష్ణ ప్రసాద్, మూలగుండ్ల ఉపేందర్ రావు, మునిగంటి శివ, ఆవుల శ్రీను, పుచ్చకాయల ఉదయ్ పాల్గొన్నారు.