మత్స్యకారులకు మళ్లీ కష్టాలే
మత్స్యకారులకు మళ్లీ కష్టాలు ప్రారంభం కానున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేండ్లు వెలుగులు విరజిమ్మిన వారి జీవితాల్లో చీకట్లు కమ్ముకోనున్నాయి.
- ఈ ఏడాది ‘ఉచిత చేప పిల్లలు’ లేనట్లే?
- జూలై వచ్చినా ఆ ఊసెత్తని కాంగ్రెస్ సర్కారు
- వేలాది కుటుంబాల్లో కమ్ముకోనున్న చీకట్లు
- జిల్లాలో బోసిపోనున్న 743 చెరువులు
- ఆందోళన చెందుతున్న మత్స్యకారులు
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 13 (నమస్తే తెలంగాణ) ; మత్స్యకారులకు మళ్లీ కష్టాలు ప్రారంభం కానున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేండ్లు వెలుగులు విరజిమ్మిన వారి జీవితాల్లో చీకట్లు కమ్ముకోనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వీరిని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు.. పాలకులు లేరు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం అవతరించిందో అప్పటినుంచి వారి మోముల్లో కాంతులు ప్రకాశించాయి. మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన చేపపిల్లల పంపిణీ పథకం మత్స్యకారుల బతుకులను సమూలంగా మార్చేసింది. వందకు వందశాతం ఉచితంగా ప్రభుత్వమే చెరువుల్లో చేపపిల్లలను పోసి కొండంత అండగా నిలబడింది. కానీ.. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కారుతో మళ్లీ వారి జీవితాలు అంధకారంలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తున్నది. జూలై నెల వచ్చినా ఈ ఏడాది ఉచిత చేపపిల్లల ఊసేలేకపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో కొత్త సర్కారు వచ్చి ఒక్కో పథకానికి మంగళం పలుకుతోంది. గత కేసీఆర్ సర్కారు హయాంలో ప్రతిష్ఠాత్మకంగా కొనసాగిన ఉచిత చేపపిల్లల పంపిణీ ఈ ఏడాది కొండెక్కినట్లే కనిపిస్తున్నది. ప్రతి ఏటా జూన్ వచ్చిందంటే ప్రభుత్వమే చేపపిల్లలను మత్స్యకారులకు ఉచితంగా చెరువుల్లో పోసి వారి జీవనోపాధికి తోడ్పాటునిచ్చేది. దీంతో మత్స్యకారులకు ఆదాయం సమకూరి జీవనం సాఫీగా సాగేది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపపిల్లల పంపిణీకి బ్రేక్ వేసింది. జూలై వచ్చినా చేపలు కాదు కదా దానికి సంబంధించిన టెండర్లు కూడా వేయకపోవడం వారి చేతగానితనానికి నిదర్శనంగా చెప్పొచ్చు.
చేపపిల్లల పంపిణీ ఊసేలేదు..
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతి యేటా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 743 చెరువుల్లో 1,77,45,900 చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసేవారు. కానీ.. నేటి కాంగ్రెస్ పాలనలో ఆ ఊసే కనబడడం లేదు. 663 చిన్న చెరువులు, 77 పెద్ద చెరువుల్లో ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఉచితంగా చేపపిల్లలను ఇచ్చేవారు. దీంతో సంఘాల సభ్యులు చేపల వేట చేసుకుని లబ్ధి పొందేవారు. జిల్లాలో 968 మత్స్యకారుల సంఘాలను గత కేసీఆర్ సర్కారు బలోపేతం చేసింది. ఇందులో సభ్యులు 2,598 మంది ఉన్నారు. వీరంతా చేపల వ్యాపారంపైనే ఆధారపడి జీవిస్తూ.. మరోవైపు చిన్నపాటి వ్యవసాయం చేస్తుండేవారు. ప్రస్తుతం ఈ ఏడాది నేటికీ చేపపిల్లలను పంపిణీ చేయకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
బోసిపోనున్న 743 చెరువులు
వానకాలం వచ్చిందంటే చాలు చెరువులు చేపల పిల్లలతో సందడిగా మారేవి. కానీ.. ఈ ఏడాది సర్కారు చేపపిల్లలను పంపిణీ చేయకపోవడంతో చెరువులన్నీ బోసిపోనున్నాయి. చెరువుల మీద ఆధారపడిన వారికి నిరాశే ఎదురుకానున్నది.
టెండర్లు కాలేదని తెలిసింది..
ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. గతంలో మాదిరిగానే ఎన్ని చెరువులు ఉన్నాయి.. ఎన్ని చేపపిల్లలు అవసరం.. అని ఒక జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. ప్రతి సంవత్సరం జూలై నాటికి చేపపిల్లలను పంపిణీ చేయడం జరిగేది. కానీ.. ఈసారి ఇంతవరకు మాకు ఎలాంటి సమాచారం రాలేదు. వస్తే తప్పకుండా పంపిణీ చేస్తాం. ఈ ఏడాది ఇంకా టెండర్లు కాలేదని తెలిసింది.
– వీరన్న, జిల్లా మత్స్యశాఖ అధికారి
ఈ ప్రభుత్వంలో నమ్మకం లేదు..
గత కేసీఆర్ సర్కారు హయాంలో ఈ పాటికి చేపపిల్లలను వదిలేసేవాళ్లం. ఇప్పుడు కనీసం టెండర్లు కూడా కాలేదని చెబుతున్నారు. చేపల వేటమీద ఆధారపడి చాలామంది ఉన్నాం. చేపలు రావని తెలిశాక బాధపడుతున్నాం. ప్రభుత్వం ఏదిచేసినా ప్రజల కోసం పనిచేయాలి. పేదలకు న్యాయం చేయాలి.
– సూర్యం, మత్స్య సంఘం చైర్మన్, శింగభూపాలెం, సుజాతనగర్ మండలం
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

