ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయండి
జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అన్నారు. మంగళవారం రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
భద్రాద్రి కొత్తగూడెం, మే 28 (నమస్తే తెలంగాణ) : జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అన్నారు. మంగళవారం రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేయాలని, కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడాలన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేలా చూడాలని, గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. అనంతరం కలెక్టర్ ప్రియాంక ఆల మాట్లాడుతూ కౌంటింగ్ ముగిసిన తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను గోడౌన్‌కు పటిష్ట భద్రత మధ్య తరలించాలన్నారు. సమావేశంలో భద్రాచలం తహసీల్దార్ శ్రీనివాస్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ రంగప్రసాద్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

