ఖమ్మానికి గుండెకాయ.. లకారం
నగర నడిబొడ్డున ఉన్న లకారం చెరువు ఖమ్మానికి గుండెకాయ అని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పథకంతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధించామని అన్నారు. నాడు కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను సమైక్య పాలకులు ధ్వంసం చేస్తే.. సీఎం కేసీఆర్ వాటిని పునర్నిర్మించారని అన్నారు.
- మిషన్ కాకతీయ పథకంతో అద్భుత ఫలితాలు
- రాష్ట్రంలో రూ.30 వేల కోట్లతో 40 వేల చెరువుల అభివృద్ధి
- తెలంగాణ ఎత్తిపోతల పథకాలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు
- ఖమ్మంలో ‘ఊరూరా చెరువు పండుగ’లో మంత్రి అజయ్
ఖమ్మం, జూన్ 8: నగర నడిబొడ్డున ఉన్న లకారం చెరువు ఖమ్మానికి గుండెకాయ అని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పథకంతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధించామని అన్నారు. నాడు కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను సమైక్య పాలకులు ధ్వంసం చేస్తే.. సీఎం కేసీఆర్ వాటిని పునర్నిర్మించారని అన్నారు. మిషన్ కాకాతీయ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 40 వేల చెరువులను రూ.30 వేల కోట్లతో తీర్చిదిద్దుకున్నామని అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్ వద్ద ‘ఊరూరా చెరువుల పండుగ’ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. తొలుత వైరా రోడ్డు నుంచి బతుకమ్మ కోలాటాలు, చేపలు పట్టే వలలు, బోనాలతో నిర్వహించిన ర్యాలీలో మంత్రి అజయ్, కలెక్టర్ వీపీ గౌతమ్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్‌ను మంత్రి సందర్శించారు. అనంతరం కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చొరవ వల్ల నేడు రాష్ట్రంలోని ప్రతి చెరువు దగ్గరా ప్రజలు వేడుకలు చేసుకుంటున్నారని అన్నారు. మనిషి జీవన విధానంలో చెరువు ఒక భాగమని అన్నారు. వర్షపు నీటికి నడక నేర్పడం అనేది గొలుసుకట్టు చెరువుల ద్వారా జరిగిందన్నారు.
చెరువుల్లోని పూడిక తీయించేందుకు సమైక్య పాలకులు కనీసం రూ.10 కూడా ఖర్చుపెట్టలేదని విమర్శించారు. దీంతో అవి బాగా పూడిపోయాయని, వాటిల్లో కనీసం 30 శాతం నీళ్లు కూడా నిలబడే పరిస్థితి లేకపోయిందని అన్నారు. ఆ సమయంలో తెలంగాణను సాధించి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. కాకతీయుల స్ఫూర్తితో మిషన్ కాకతీయ పథకంతో రాష్ట్రంలోని 40 వేల చెరువుల్లో పూడిక తీయించారని గుర్తుచేశారు. కేసీఆర్ చేసిన గొప్ప ఆలోచన వల్ల నేడు ఎండాకాలంలోనూ చెరువులో అలుగులు పోస్తున్నాయని గుర్తుచేశారు.
ఒకప్పుడు దుర్భరంగా ఉన్న లకారాన్ని నేడు అద్భుతంగా తీర్చిదిద్దుకున్నామని అన్నారు. తద్వారా భూగర్భజలాలు పెరిగాయన్నారు. ప్రకాశ్‌నగర్ వద్ద నిర్మించుకున్న చెక్‌డ్యామ్ వల్ల ఆ ప్రాంత ప్రజల నీటి బాధలు తొలగిపోయాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 330 చెరువుల దగ్గర నేడు పండుగలు జరుగుతున్నాయని అన్నారు. అనంతరం సాహిత్య దినోత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

