వాడిపోతున్న పత్తి మొక్కలు
ఈ ఏడాది పత్తి సాగుచేస్తున్న రైతులకు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యేలా కన్పిస్తోంది. ఈ తొలకరిలో ముందుగానే కొద్దిపాటి వర్షాలు కురిశాయి. దీంతో తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో రైతులు పత్తి విత్తనాలు నాటారు.
- తిరుమలాయపాలెంలో నెర్రెలువారుతున్న పంట చేలు
- వరుణుడి కరుణ కోసం చూస్తున్న మండల కర్షకులు
తిరుమలాయపాలెం, జూన్ 19: ఈ ఏడాది పత్తి సాగుచేస్తున్న రైతులకు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యేలా కన్పిస్తోంది. ఈ తొలకరిలో ముందుగానే కొద్దిపాటి వర్షాలు కురిశాయి. దీంతో తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో రైతులు పత్తి విత్తనాలు నాటారు. కానీ ఆ తరువాత నుంచి వర్షాలు మొఖం చాటేశాయి. అదే సమయంలో ఎండల వేడి మరికొంత పెరిగింది. ఫలితంగా ఇప్పటికే వేసిన పత్తి మొక్కలు వాడిపోతున్నాయి.
40 శాతం విత్తనాలు మొలకెత్తనట్లేనా?
తిరుమలాయపాలెం మండలంలో పత్తి పంట సాధారణ సాగు విస్తీర్ణం 13,000 ఎకరాలు. ఈ ఏడాది ఇప్పటి వరకు 5,000 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తున్నారు. తొలకరి వర్షాల సమయంలోనే విత్తనాలు విత్తారు. కానీ ఆ తరువాత నుంచి వరుణుడు మొఖం చాటేశాడు. దీంతో విత్తనాలన్నీ ఎండిపోతున్నాయి. మండలంలో సుమారుగా 40 శాతం పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. మరీ ముఖ్యంగా గడిచిన వారం రోజులుగా కొద్దిపాటి వర్షాలు కూడా కురవకపోవంతో పంట చేలన్నీ నెర్రెలువారుతున్నాయి. వాటిల్లోని పత్తి మొక్కలు వాడిపోతున్నాయి. దీంతో వరుణుడి కరుణ కోసం కర్షకులు కళ్లలో ఒత్తులేసుకుంటున్నారు. ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. మరో ఒకటి రెండు రోజుల్లో వర్షపు జల్లులు కురవకపోతే పత్తి రైతులకు నష్టపోయే ప్రమాదం లేకపోలేదు.
రెండుమూడు రోజుల్లో వర్షం రాకపోతే కష్టమే..
వర్షాలు కురుస్తాయేమోననుకొని పత్తి విత్తనాలు నాటాం. ఆ రోజు నుంచి వాన జాడలేకుండా పోయింది. దీంతో నాటిన వాటిల్లో సగం విత్తనాలు మొలకెత్తలేదు. కొన్ని చోట్ల మొక్కలు మొలిచినా ఈ ఎండకు అవి మాడిపోతున్నాయి. మరో రెండుమూడు రోజుల్లో వర్షం రాకపోతే కష్టమే. మళ్లీ చేనును చెడగొట్టి మరోసారి అచ్చుతోలి పత్తి విత్తనాలు నాటాల్సి వస్తుంది. దక్కులు, కూళ్లు, విత్తనాలు కలిపి మొత్తం ఎకరానికి రూ.ఐదు వేల వరకూ నష్టపోవాల్సి వస్తుంది.
-యనగందుల సత్యం, రైతు, పిండిప్రోలు
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

