మంగళవారం 31 మార్చి 2020
Khammam - Jan 28, 2020 , 23:36:03

నెల రోజులు గా జాతరకు రాక పోకలు

నెల రోజులు గా జాతరకు రాక పోకలు

గత నెల రోజలు నుండి భక్తులంతా మేడారం సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు వెళుతున్నారు. అసలైన జాతర ఫిబ్రవరి 5,6,7 తేదీల్లో ఉండటంతో చివరి రోజులు దర్శనం దొరకడం కష్టం అనుకున్న భక్తులు ముందు నుండే మేడారం పయనమవుతున్నారు. జాతరకు మించి భక్తులు ఇప్పటి నుండే అక్కడకు చేరడంతో మేడారం జన జాతరను తలపిస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం అదే స్థాయిలో సౌకర్యాలు కల్పించడంతో మేడారం ప్రయాణం సులభతరం అయింది. అన్ని జిల్లాల నుండి ఆర్‌టీసీ బస్‌లు స్పెషల్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ అధికారులు సైతం అక్కడకు వెళ్లి ప్రయాణికుల సౌకర్యాలు కల్పిస్తున్నారు. బస్టాండ్‌లో  బస్‌కోసం ఎదురు చూసే పనిలేకుండా క్షణంలో బస్ దొరికే విధంగా ఈసారి ఆర్‌టీసీ ప్రయాణికులకు బాసటగా నిలుస్తుంది.

తల్లులపై నమ్మకం తనివితీరా దర్శనం...

అశేష ప్రజానికానికి తల్లులపై మరింత నమ్మకం పెరగడంతో తనివితీరా దర్శనం దొరుకుతుంది. దర్శనం చేసుకున్న ప్రతీ భక్తుడికి సమ్మక్క బంగారం పంపిణీ చేయడంతో భక్తులు సమ్మక్కకు మళ్లీ మళ్లీ వస్తామంటూ మరిన్ని మొక్కులు మొక్కుకుంటున్నారు. పిల్లా పెద్దా తేడా లేకుండా జంపన్న వాగులో స్నానాలు చేసి తల్లుల దర్శనం చేసుకుంటున్నారు. అటు ఉద్యోగులు, ఇటు సమ్మక్క ఉత్సవ కమిటీ నిర్వహకులు భక్తులను ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.  దానితో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భక్తులు విరివిగా మేడారం జారతకు పయనమవుతున్నారు.

ఇక్కడ పెట్టాకే అక్కడకు పయనం..

ప్రతీ ఏటా ఆనవాయితీగా వస్తున్న సమ్మక్క జాతరకు ఇంటి వద్ద సమ్మక్కకు మొక్కు తర్చాకే అక్కడకు వెళ్లే ఆచారం చాలా కాలం నుండి సాగుతుంది. అదే రీతిలో ఇక్కడి భక్తులు ఇంటి వద్ద సమ్మక్కకు మొక్కు తీర్చి మేడారం పయనమవుతున్నారు. దానితో బెల్లం షాపులు పెద్ద బజార్ మేడారం భక్తులతో సందడిగా మారింది. ఇదే కాక స్థానికంగా ఉన్న సమ్మక్క గద్దెల వద్ద జాతరలకు ఆయా గ్రామాల నిర్వహకులు గద్దెలను ముస్తాబు చేశారు. బస్ స్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు ప్రయానికులతో కిక్కిరిసిపోయాయి. జిల్లా భక్తుల కోసం ఆర్‌టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్‌లతో ప్రయాణికుల ప్రయాణం సులభతరం అయింది. భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట ప్రాంతాల నుండి ఆర్‌టీసీ ప్రత్యేక బస్‌లు నడుపుతుంది. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.


logo
>>>>>>