Road accident | బొమ్మరెడ్డిపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామ శివారులోని బస్ షెల్టర్ సమీపాన కరీంనగర్-రాయపట్నం రహదారిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని బైక్ ను ఢీకొట్టడంతో కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగం పేట గ్రామానికి చెందిన తమ్మనవేని శ్రీనాథ్ (26) అనే యువకుడు మృతి చెందాడు.
- కరీంనగర్-రాయపట్నం రహదారిపై ఘటన
- చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో విషాదఛాయలు
Road accident | ధర్మారం, చొప్పదండి, నవంబర్ 3 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామ శివారులోని బస్ షెల్టర్ సమీపాన కరీంనగర్-రాయపట్నం రహదారిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని బైక్ ను ఢీకొట్టడంతో కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగం పేట గ్రామానికి చెందిన తమ్మనవేని శ్రీనాథ్ (26) అనే యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటనతో రాగంపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. చొప్పదండి మండలం రాగం పేట గ్రామానికి చెందిన తమ్మనవేణి లక్ష్మి-మల్లయ్యలకు శ్రీకాంత్, శ్రీనాథ్ ఇద్దరు కుమారులు. తల్లిదండ్రులు గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతూ వారి ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేశారు. ఇద్దరు కుమారులు ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు.
పెద్ద కుమారుడు శ్రీకాంత్ జమ్మికుంటలో ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమారుడు శ్రీనాథ్ గత రెండు సంవత్సరాలుగా మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేశాడు. కాగా శ్రీనాథ్ గత వారం రోజుల క్రితం జగిత్యాల జిల్లా కేంద్రానికి బదిలీపై ఓ బ్యాంకుకు వచ్చాడు. రోజు ఉదయం రాగంపేట గ్రామం నుండి డ్యూటీకి జగిత్యాలకు వెళ్లి తిరిగి వచ్చేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం జగిత్యాల వెళ్లి విధులు ముగించుకొని బైక్ పై స్వగ్రామం వెళ్లడానికి వస్తున్నాడు. మార్గం మధ్యలో రాత్రి సమయంలో ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి స్టేజి బస్ సెంటర్ సమీపంలో గుర్తు తెలియని శ్రీనాథ్ బైక్ ను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లింది. దీంతో శ్రీనాథ్ వాహనంపై ఎగిరి పడడంతో అతని తలకు బలమైన గాయమై రక్తస్రావం కావడంతో చికిత్స కోసం సంఘటన స్థలం నుంచి 108 అంబులెన్స్ వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించారు.
చికిత్స పొందు పరిస్థితి విషమించి అదే రాత్రి దవాఖానలో శ్రీనాథ్ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొడుకు మరణ వార్త విని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు చేరుకున్నారు. చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో శ్రీనాథ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మంగళవారం ధర్మారం పోలీసులు కరీంనగర్ వెళ్లి ప్రమాద సంఘటన వివరాలు సేకరించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
Tusshar Kapoor | రూ.5 కోట్లు ఇవ్వకుంటే లేపేస్తాం.. మరో బాలీవుడ్ నటుడికి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..!
Abdulla Shahid: చిన్నారిపై లైంగిక వేధింపులు.. మాల్దీవులు మాజీ విదేశాంగ మంత్రి అరెస్టు
AP News | తూర్పుగోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థుల హవా.. మూడు వార్డుల్లోనే వైసీపీ ఆధిక్యం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

