Peddapally | పెద్దపల్లి, సెప్టెంబర్17: పెద్దపల్లి కలెక్టరేట్లో యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడులు బుధవారం నిర్వహించారు. రాష్ర్ట మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కొత్వాల్ సాహెబ్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్లు దాసరి వేణు, జల్ద అరుణశ్రీ, డీపీపీ కరుణాకర్ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూల మాలలు వేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రంగారెడ్డి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, విశ్వకర్మ కుల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.