Collector Sandeep Kumar | ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్, జూలై 18: మహిళలు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సందీప్‌కుమార్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబురాలల్లో భాగంగా ముస్తాబాద్ మండలం ఆవునూరు గాయత్రి గ్రామైక్య సంఘం, ఎల్లారెడ్డిపేటలో చైతన్య గ్రామైక్య సంఘం, కోరుట్లపేటలో భాగ్య శ్రీ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఎరువులు పురుగు మందుల దుకాణాలను శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబాలు చక్కగా నిలబడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మార్కెట్ కమిటీ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.