Chinna Mulkanoor village | చిన్న ముల్కనూరులో నీటి ఎద్దడిపై మహిళల నిరసన
Chinna Mulkanoor | చిగురుమామిడి, జూలై 6: చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూరు గ్రామంలో ఉన్న నాలుగో వార్డులో గత పది రోజులుగా నెలకొన్న తీవ్ర నీటి సమస్యతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Chinna Mulkanoor village | చిగురుమామిడి, జూలై 6: చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూరు గ్రామంలో ఉన్న నాలుగో వార్డులో గత పది రోజులుగా నెలకొన్న తీవ్ర నీటి సమస్యతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి ఎద్దడిపై పలుమార్లు గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేసినా, సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి ఎద్దడి తీవ్రం కావడంతో, ఆదివారం ఉదయం ఖాళీ బిందెలతో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ, తక్షణమే తమ ప్రాంతానికి నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
దీనిపై గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్న స్పందించారు. నీటి ఎద్దడి సమస్యలకు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని ఆమె తెలిపారు. అలాగే, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపడుతున్నామని ఆమె హామీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో రంగు పద్మ, పైడిపల్లి రేణుక, మల్లవ్వ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

