Bommanapalli | బొమ్మనపల్లిలో ఆరోగ్య ఉప కేంద్రం పూర్తయ్యేది ఎన్నడు..? ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని నిర్మాణ పనులు
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Bommanapalli | చిగురుమామిడి, నవంబర్ 22 : చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు రూ.16 లక్షలతో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు నిర్మాణ పనులు ముందుకు సాగకపోగా, కనీసం పిల్లర్ల నిర్మాణం కూడా పూర్తిస్థాయిలో చేపట్టకపోవడం గమనార్హం.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఆరోగ్య ఉప కేంద్రం పనులు ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉండటంతో గ్రామస్తులకు నిరీక్షణ తప్పడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయించి గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pre Diabetes | ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి.. ఈ దశ నుంచి ఎలా బయట పడాలి.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Disha Patani | సైకిల్ పక్కన దిశా పటానీ అందాల పోజులు.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
Madhavaram krishna Rao | ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దు.. నిరాహార దీక్షలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
TTD | టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ ట్రెడిషనల్ లుక్.. పసుపు చీరలో మెరిసిపోయిన బాలీవుడ్ బ్యూటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

