Oditela Satish Kumar | చిగురుమామిడి, ఆగస్టు 29 : మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్‌కుమార్ హామీ ఇచ్చారు. చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను ఆయన శనివారం పరామర్శించి మృతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామంచలో నర్రా జగదీశ్వర్ రెడ్డి, ఇందుర్తిలో గౌరవేని లచ్చవ్వ, బల్ల రాములు, సీతారాంపూర్ లో ముసుకు వెంకట్ రెడ్డి, రేకొండలో పరు పాటి కనకవ్వ, చిగురుమామిడిలో కోనేటి వెంకవ్వ మృతిచెందిన కుటుంబాలను పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నుండి రామంచ జగదీశ్వర్ రెడ్డి, ఇందుర్తి బల్ల రాములు పార్టీ బలోపితం కోసం కృషి చేశారని అన్నారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, మండల నాయకులు బేతి రాజిరెడ్డి, రామోజు కృష్ణమాచారి, అందె సుజాత, మారెళ్ల చంద్రయ్య ఆకుల మొగిలి, అందే రాజమల్లు, సిద్దింకి రాజమల్లు, బిళ్ల వెంకట్‌రెడ్డి, బెజ్జంకి రాంబాబు, కాశబోయిన విజయలక్ష్మి, రాజు, మహంకాళి కొమురయ్య, అందే పోచయ్య గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు గిట్ల తిరుపతి రెడ్డి, ఎస్కే సిరాజ్, శ్యామకూర సంపత్ రెడ్డి, పరిపాటి రవీందర్ రెడ్డి, ముసుకుల కృష్ణారెడ్డి, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.