Godavarikhani | త్వరలో రాజేష్ థియేటర్ జంక్షన్ వెడల్పు చేస్తాం.. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి
గోదావరిఖని రాజేష్ థియేటర్ వద్ద గల జంక్షన్ వెడల్పు పనులను శుక్రవారం రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు వెంటనే తరలించాలని ఎన్పీడీసీఎల్ అధికారులను కోరారు.
Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 23 : గోదావరిఖని రాజేష్ థియేటర్ వద్ద గల జంక్షన్ వెడల్పు పనులను శుక్రవారం రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు వెంటనే తరలించాలని ఎన్పీడీసీఎల్ అధికారులను కోరారు. శుక్రవారం 49వ డివిజన్ లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. శారదానగర్ లో స్తంభాలు వేసి విద్యుత్ తీగలు బిగించలేదని గమనించి ట్రాన్స్ కో అధికారులను పిలిపించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే విద్యుత్ తీగలకు ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని సూచించారు.
సీఎస్ఆర్ నిధులు సుమారు రూ.6 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్యాకేజీ పనుల్లో భాగంగా మార్కండేయ కాలనీ ఫైర్ స్టేషన్ ప్రక్కన నుంచి శారదానగర్ వాటర్ ట్యాంక్ ప్రహరీ వెంబడి ప్రధాన రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం మార్కండేయ కాలనీ రోడ్డు జంక్షన్ వెడల్పు పనులను పరిశీలించారు. డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, కార్పొరేటర్లు సంతోష్ రావు, గట్ల రమేష్, ఏడీఈ గుండు శ్రీనివాస్, ఏసీపీ నవీన్, నాయకులు తిప్పారపు శ్రీనివాస్, కృపాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

