B Vinod Kumar | దీక్షా దివస్ ఘనంగా నిర్వహిస్తాం.. మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి
అలుగునూర్‌లో ఆదివారం జరగనున్న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిస్తామని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు.
B Vinod Kumar | తిమ్మాపూర్, నవంబర్ 28 : అలుగునూర్‌లో ఆదివారం జరగనున్న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిస్తామని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్,మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. ఈ మేరకు వారు శనివారం దీక్షా దివస్ నిర్వహించే ప్రాంగణం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పు సత్యాగ్రహం ఎంత గొప్పదో కేసీఆర్ చేసిన దీక్ష అంత గొప్పదని భావించుకోవాలని, దీక్ష దివస్ లేకుంటే తెలంగాణ లేదని స్పష్టం చేశారు.
కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అనే నిదానంతో పోరాటం సాగిందని గుర్తు చేశారు. దీక్షతోనే మళ్లీ ఉద్యమానికి నాంది పలికిందని అన్నారు. కేసీఆర్ సీఎం గా ఉన్న 10 ఏళ్లలో ఎన్నడైనా పంటల ఎండయా అని ప్రశ్నించారు. ఇది కాలంతో వచ్చిన కరువు కాదని, రేవంత్ రెడ్డి తెచ్చిన తరువాత విమర్శించారు. నాడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి తుపాకి పట్టుకొని కరీంనగర్ వచ్చాడని, నాటి అరాచకాలు పోరాటాలు యువతరానికి తెలియాలని కానీ వినీ ఎరుగని రీతిలో సభను నిర్వహించబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

