Eye donation | ఓదెల, జూలై 28 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నేత్రదాత గాండ్ల సత్యం సంస్మరణ సభను సదాశయ ఫౌండేషన్ సోమవారం నిర్వహించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఓదెలకు చెందిన సింగరేణి కార్మికుడు సత్యం మృతి చెందాడు. పుట్టడు దుఃఖంలో ఉండి కూడా మృతుడి కుటుంబ సభ్యులు నేత్రాలను దానం చేయడాన్ని అభినందించి ప్రశంస పత్రాన్ని అందజేశారు.
మరణానంతరం నేత్రాలు వృథాగా మట్టిలో కలిసిపోవడం కంటే దానం చేయడం వల్ల ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించిన వారు అవుతారని తెలిపారు. మూఢనమ్మకాలను విడిచిపెట్టి మరణానంతరం నేత్రాలను దానం చేయాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి భీష్మచారి, ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ జూనియర్ అసిస్టెంట్ ముద్దసాని కుమారస్వామి, క్యాతం మల్లేశం తదితరులు పాల్గొన్నారు.