CPI | కోరుట్ల, జూన్ 25: ప్రజలు తమ హక్కుల సాధన కోసం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వెన్న మహేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు పిలుపునిచ్చారు. పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో సీపీఐ పట్టణ 11వ మహాసభను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో పార్టీ పతాకాన్ని ఎగరవేశారు. అమరవీరులకు ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి సర్కార్ ప్రజా, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు.
ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను హతమారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలో అమెరికా పాత్ర పై భారత్ తన విధానాన్ని వెల్లడించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, ఆరు గ్యారెంటీలలో ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు అర్హులకు వెంటనే ఇవ్వాలని తీర్మానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నేతలు మహమ్మద్ మౌలానా, ఎండి ముక్రం, రాష్ట్ర మాజీ కమిటీ సభ్యులు చేన్న విశ్వనాథం, పట్టణ కార్యదర్శి యన్నం రాధ, తిప్పర్తి రమేష్ మ్యాదరి గణేష్ మహమ్మద్ అలీ, చింతకింది గణేష్, అశోక్, దాసరి మనోహర్, జాగిలం భూమయ్య, అందే వంశీకృష్ణ, సమీర్, సాంబార్ మహేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.