Sunke Ravishankar | కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశాం.. మళ్లీ వేసేదీ లేదని వృద్ధురాలి వెల్లడి
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలను నమ్మి మోసపోయామని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గోస పడుతున్నామని గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
Sunke Ravishankar | గంగాధర, నవంబర్ 24 : కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలను నమ్మి మోసపోయామని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గోస పడుతున్నామని గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీక్షా దివస్ సభ సందర్భంగా గంగాధర మండలం కొండన్నపల్లిలో బొట్టు పెట్టే కార్యక్రమాన్ని నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో తమ బాధను వెళ్లబుచ్చారు.
ఉచిత బస్సు ప్రయాణంతో తమకు లాభం లేదని పేర్కొన్నారు. తీవ్రమైన కరెంటు కోతలతో పంటలు ఎండిపోయాయని, మిగిలిన వడ్లు అమ్ముకొందామంటే కొనేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. వరి కోతలు కోసి నెలన్నర దాటుతున్న సర్కారు వడ్లు కొనడం లేదని, రూ.500 బోనస్ మాటే లేదని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. కేసీఆర్ వస్తేనే రైతుల పరిస్థితి బాగుపడుతుందని, జీవితంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేది లేదని, కేసీఆర్ కే ఓటు వేసి గెలిపించుకుంటామని గ్రామస్తులు స్పష్టం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthika Pournami | యాదగిరిగుట్టలో భక్తుల సందడి
Microsoft Employee | 24 ఏళ్లు నమ్మకంతో పనిచేస్తే.. ఒక్క మెయిల్‌తో ముగింపు.. మెక్రోసాఫ్ట్ ఉద్యోగిని ఎమోషనల్ పోస్టు
Panchayat 5 | ఫులేరాలో మారిన రాజకీయం.. ఆకట్టుకుంటున్న ‘పంచాయత్ 5’ ట్రైలర్!
Bank Jobs | ఎగ్జిమ్ బ్యాంక్‌లో 120 ఖాళీలు.. నవంబర్ 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం
Chiranjeevi Megaverse | చిరంజీవి పేరులో ‘N’ మాయం వెనుక అసలు కథ ఇదే.. ‘మెగావర్స్’ టీజర్ వచ్చేసింది!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

