కొలువుదీరనున్న వేంకటేశ్వరుడు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మానగర్‌లో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం లభించనున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని టీటీడీకి కేటాయించింది. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో కరీంనగర్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కృషితో కరీంనగర్ ప్రజల చిరకాల స్వప్నం సాకారం కానున్నది.
- 31న కరీంనగర్లో ఆలయ నిర్మాణానికి ఆలయ నిర్మాణానికి భూమిపూజ l20 కోట్లతో 10 ఎకరాల్లో నిర్మాణం
- మంత్రి గంగుల, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కు అనుమతి పత్రాలు అందజేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
- అదే రోజు వేంకటేశ్వరస్వామి కల్యాణం
- పరిశీలనకు త్వరలోనే తిరుమలకు వెళ్తామన్న మంత్రి గంగుల
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మానగర్‌లో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం లభించనున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని టీటీడీకి కేటాయించింది. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో కరీంనగర్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కృషితో కరీంనగర్ ప్రజల చిరకాల స్వప్నం సాకారం కానున్నది. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కరీంనగర్లో శ్రీవారి ఆలయ నిర్మాణ అనుమతి పత్రాలను గంగుల కమలాకర్, బోయినపల్లి వినోద్‌కుమార్, టీటీడీ తెలంగాణ అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాసరరావుకు అందజేశారు.
సీఎం కేసీఆర్ విజ్ఞప్తితో ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో కరీంనగర్ పట్టణంలో రూ.20 కోట్ల వ్యయంతో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. మే 31న ఉదయం 7:26 గంటలకు వేదమంత్రోచ్ఛారణల నడుమ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. త్వరలోనే తిరుమలకు వెళ్లి శ్రీవారి ఆలయ నిర్మాణాల నమూనాలపై చర్చిస్తామని, సకాలంలో శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

