గంగాధర, మార్చి 27 : గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్‌కు మంగళవారం ఎల్లంపల్లి జలాలు రానున్నాయి. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కృషితో ఇప్పటికే రూ.90 లక్షలతో కట్టకు మరమ్మతు పూర్తి చేయగా, అధికారులు ఇప్పటికే డ్రైరన్ చేపట్టారు. రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోయడం వల్ల చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో లక్షా 50 వేల ఎకరాలు సస్య శ్యామలం కానుండగా, రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
యేసంగి పంటలు ఎండి పోకుండా భరోసా కల్పిస్తూ ఎల్లంపల్లి జలాలు నేడు గంగాధర గడ్డపై జలసవ్వడి చేయనున్నాయి. ఇప్పటికే డ్రైరన్ పూర్తి చేసిన అధికారులు అన్ని సక్రమంగా సాగితే నారాయణపూర్‌కు నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది జూలై, ఆగస్టులో కు రిసిన భారీ వర్షాలకు నారాయణపూర్ రిజర్వాయర్ నీటి మట్టం ప్రమాదకర స్థితికి చేరడంతో అధికారులు రిజర్వాయర్ కట్టకు గంటి పెట్టారు. దీంతో గత కొ న్ని నెలలుగా రిజర్వాయర్‌లో నీరు లేక ఎడారిని తలపించింది. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి చెరువు కట్ట మరమ్మతులకు 90 లక్షలు మంజూరు చేయించారు. పనులను గ్రామస్తులు అడ్డుకోవడంతో స్వయంగా గ్రామస్తులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో కట్ట మరమ్మతు పనులు ముందుకు సాగాయి. ఎమ్మెల్యే ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన అధికారులు కట్ట మరమ్మతు పనులను పూర్తి చేశారు.
దీంతో రిజర్వాయర్‌ను నీటితో నింపేందుకు సర్వం సిద్ధమైంది. ఎమ్మెల్యే రవిశంకర్ స మస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు నిరంతరం అధికారులతో మాట్లాడుతూ పనులను పూర్తి చేయించడంతో పాటు నీటి విడుదలకు మార్గం సుగమం చేశారు. నీటి విడుదల జరిగితే చొప్పదండి నియోజకవర్గంతో పాటు వేములవాడ నియోజకవర్గాల్లో దాదాపు 1 లక్షా 50 వేల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశం ఉంది. అలాగే భూగర్భ జలాలు పెరిగి తాగు, సాగు నీటి కరువు తీరుతుంది. ఇబ్బందికర పరిస్థితుల్లో సైతం విమర్శలను పట్టించుకోకుండా ముందు బాధితులను ఒప్పించి రిజర్వాయర్ కట్టకు మరమ్మతులు చేయించ డంతో పాటు ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేయిస్తున్న సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు నియోజకవర్గ రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.