Vemulawada | బతికి ఉండగానే స్మశానానికి..! కొన ఊపిరితో ఉన్న కొడుకుని చూసి తల్లడిల్లిన తల్లి అమృత
చెట్టంత కొడుకు అనారోగ్యం పాలై జీవచ్ఛవంలా కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా తన కండ్ల ముందే కొడుకుని స్మశానానికి తీసుకెళ్లాల్సిన దుర్భర పరిస్థితి ఏ తల్లికి రాకూడదంటూ తల్లి అమృత తల్లడిల్లిన తీరు ప్రతి గుండెను పిండేసింది.
- మున్సిపల్ చైర్మన్ రాజు చొరవతో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
- వేములవాడలో మంట కలిసిన మానవత్వం
Vemulawada | వేములవాడ, నవంబర్ 6 : చెట్టంత కొడుకు అనారోగ్యం పాలై జీవచ్ఛవంలా కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా తన కండ్ల ముందే కొడుకుని స్మశానానికి తీసుకెళ్లాల్సిన దుర్భర పరిస్థితి ఏ తల్లికి రాకూడదంటూ తల్లి అమృత తల్లడిల్లిన తీరు ప్రతి గుండెను పిండేసింది. చందుర్తి మండలంలోని కిష్టంపేట గ్రామానికి మర్రిపల్లి అమృత ఇద్దరు కుమారులు కాగా ఒకరు నిజాంబాద్ లో ఉంటుండగా అనారోగ్యం పాలైన కుమారుడు రాకేష్ ను పట్టుకొని వేములవాడలో అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. రాకేష్ కాలేయ సమస్యతో బాధపడుతూ అనారోగ్యం పాడిన పడ్డాడు. అయితే పరిస్థితి విషమించగా కొనఊపిరితో ఉన్న రాకేష్ ను గురువారం వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వైద్యం కోసం తరలించింది.
పరిస్థితి విషమంగా ఉండడంతో సిరిసిల్ల జనరల్ ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచించడంతో అక్కడికి వెళ్లలేని పరిస్థితుల్లో మళ్లీ తిరిగి అద్దె ఇంటికి చేరుకుంది. కొన ఊపిరితో ఉన్న రాకేష్ ను చూసిన యజమాని అభ్యంతరం వ్యక్తం చేయడంతో శుక్రవారం తెల్లవారుజామున వేములవాడ పట్టణంలోని వైకుంఠధామానికి తీసుకువచ్చారు. ప్రాణం ఉండగానే స్మశాన వాటికకు చేరుకోవడంతో తల్లి గుండె తెల్లటిల్లడంతో పాటు కన్నీటి పర్యంతమైంది. చివరకు విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కమిషనర్ లోకేష్ అక్కడికి చేరుకొని 108 వాహనంలో సిరిసిల్ల జనరల్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సను అందించారు. రాకేష్ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు సూచించినట్లు వారు తెలిపారు. మనిషి బ్రతికి ఉండగానే స్మశానానికి తీసుకెళ్లిన ఘటన మానవత్వాన్ని మంట మంట కలిపింది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

