Ties and belts | కథలాపూర్, జూలై 17 : కథలాపూర్ మండలం దుంపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఎన్ఆర్ఐ జెల్ల శంకర్ యాదవ్ గురువారం టై, బెల్ట్ లు పంపిణీ చేసినట్లు ఉపాధ్యాయులు, గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రోత్సహించేందుకు టై, బెల్టులు అందించినట్లు ఆయన తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. దాత శంకర్ కు ఉపాధ్యాయులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగంపల్లి సతీష్ , పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.