Huzurabad | హుజురాబాద్‌లో తాళం పగలగొట్టి చోరీ.. రూ.50 వేల నగదు, 20 తులాల వెండి అపహరణ
హుజురాబాద్ పట్టణంలో తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న రూ.50 వేల నగదు, 20 తులాల వెండిని ఎత్తుకెళ్లారు. పాత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఆర్కే బిల్డర్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Huzurabad | హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న రూ.50 వేల నగదు, 20 తులాల వెండిని ఎత్తుకెళ్లారు. పాత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఆర్కే బిల్డర్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆర్కే బిల్డర్స్‌లో నివాసం ఉంటున్న సింగిరెడ్డి లక్ష్మి హైదరాబాద్‌కు వెళ్లారు.
ఆమె ఇంట్లో లేని విషయాన్ని గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని రూ.50 వేల నగదు, 20 తులాల వెండిని అపహరించి అక్కడి నుంచి పరారయ్యారు. గురువారం తెల్లవారుజామున పక్కింటి వారు గమనించి చోరీ జరిగిన విషయాన్ని లక్ష్మికి తెలియజేశారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | దేవరకద్రలో దీక్షాదివస్‌ను విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
అటవీ నిబంధనలు గిరిజనుల అభివృద్ధికి అడ్డంకి కాకూడదు : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Massive Donation | తిరుమల శ్రీవారికి భారీ విరాళం..రూ.206 కోట్లు విలువ గల ఆభరణాలు అందజేత
ప్రజాస్వామ్య ఆదర్శాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి : సీఈఓ నాగలక్ష్మి
Tarnaka traffic jam | రోడ్డు తవ్వకాలతో తార్నాక మెయిన్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

