గనుల వేలంపై కన్నెర్ర
సింగరేణి బొగ్గు గనుల వేలంపై కార్మిక లోకం కన్నెర్రజేసింది. వామపక్ష పార్టీలు, సింగరేణి కార్మిక సంఘాలతో కలిసి గర్జించింది. కరీంనగర్, పెద్దపల్లి కలెక్టరేట్ల ఎదుట మహాధర్నాకు దిగింది.
- కార్మిక వాడల నుంచి కదిలిన దండు
- కరీంనగర్, పెద్దపల్లి కలెక్టరేట్ల ముట్టడి
- గనుల వేలాన్ని ఆపాలని వామపక్షాల మహాధర్నా
- సింగరేణికే కేటాయించాలని డిమాండ్
- బీజేపీ, ప్రధానికి వ్యతిరేకంగా మిన్నంటిన నినాదాలు
సింగరేణి బొగ్గు గనుల వేలంపై కార్మిక లోకం కన్నెర్రజేసింది. వామపక్ష పార్టీలు, సింగరేణి కార్మిక సంఘాలతో కలిసి గర్జించింది. కరీంనగర్, పెద్దపల్లి కలెక్టరేట్ల ఎదుట మహాధర్నాకు దిగింది. ప్రైవేటీకరణ విధానాలను మాను కోవాలని, బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలని సింగరేణికే ఆ గనులను కేటాయించాలని డిమాండ్ చేసింది.
పెద్దపల్లి, జూలై 5(నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలోని కార్మిక క్షేత్రాలైన గోదావరిఖని, యైటిైంక్లెన్‌కాలనీ, సెంటినరీకాలనీల నుంచి కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మహాధర్నా నిర్వహించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాన మంత్రి మోదీకి వ్యతిరేకంగా నినదించారు. ఉదయం నుంచి ఆయా కార్మిక వాడల నుంచి బైక్‌లకు ఎర్రజెండాలు బిగించి బైక్‌లతో ర్యాలీగా తరలివచ్చిన కార్మికులు కలెక్టరేట్ కార్యాలయ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బొగ్గుగని బ్లాక్‌ను సింగరేణికే అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. వామపక్ష కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, సీపీఐఎంఎల్ న్యూడెమక్రసీ, ఐఎఫ్‌టీయూల నాయకులు, కార్యకర్తలు మహాధర్మాలో పాల్గొన్నారు.

కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నాలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, నాయకులు
కరీంనగర్ కలెక్టరేట్, జూలై 5 : కరీంనగర్లో సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీల ప్రతినిధులతో పాటు ఆల్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా శాఖల నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బొగ్గు బ్లాకుల వేలంపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఐక్య ఆందోళనలకు దిగారు. ప్రజాభీష్టానికి భిన్నంగా పాలన ప్రారంభించిన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

