విద్యానగర్, ఫిబ్రవరి 13 : ఇటీవల ప్రతిమ, చల్మెడ వైద్య కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ శిబిరంలో చేసిన క్యాన్సర్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. 800 కుపైగా మహిళలకు టెస్టులు చేయగా, శిబిరంలో పాల్గొన్న వారికి మంగళవారం కరీంనగర్ భగత్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ప్రతిమ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బోయినపల్లి మాధవి అవగాహన కల్పించారు.
ఇలాంటి వైద్య శిబిరాల వల్ల ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే వందశాతం నయం చేయవచ్చునని సూచించారు. శిబిరాల్లో 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ పరీక్షలు చేసుకోవాలని సూచించారు.