Chada Venkat Reddy | రామగుండం ఎమ్మెల్యే, సీఐలు నియంత పోకడలు తగ్గించుకోవాలి.. సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకట్ రెడ్డి
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్, గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి నియంత పోకడలు తగ్గించుకోవాలని, లేదంటే కమ్యూనిస్టుల నుంచి ప్రతిఘటన తప్పదని సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
Chada Venkat Reddy | కోల్ సిటీ, నవంబర్ 5 : రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్, గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి నియంత పోకడలు తగ్గించుకోవాలని, లేదంటే కమ్యూనిస్టుల నుంచి ప్రతిఘటన తప్పదని సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కూల్చివేతల బాధితులకు న్యాయం చేయాలని ఇటీవల గోదావరిఖని చౌరస్తాలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య, పార్టీ కార్యకర్తలపై వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి విచక్షణరహితంగా జనం చూస్తుండగానే మెడలు పట్టి బట్టలు చింపి అసభ్య పదజాలంతో ఈడ్చుకెళ్లి అక్రమ కేసు బనాయించడం దుర్మార్గపు చర్య అన్నారు. జరిగిన సంఘటనపై గురువారం పార్టీ శ్రేణులను అడిగి తెలుసుకొన్న ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ప్రజా పోరాటాలలో కమ్యూనిస్టులు ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. ఎల్బీ నగర్, తిలక్ నగర్ లో 40 ఏండ్లుగా0 ఉంటున్న దుకాణాలను రోడ్డు వెడల్పు సాకుతో కూల్చివేయడం, ఆ తర్వాత మేయర్, సింగరేణి జీఎంలు కొబ్బరికాయలు కొట్టి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేయడం అంత నాటకీయమా అని ప్రశ్నించారు. తీరా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయ్యాక అనుమతులు లేవని సింగరేణి అధికారులతో మళ్లీ కూల్చివేయించడం విడ్డూరంగా ఉందన్నారు. దుకాణదారుల పొట్ట కొట్టినందుకు ప్రశ్నించిన సీపీఐ ప్రజాప్రతినిధిపై అక్రమ కేసు బనాయించడం సమంజసం కాదన్నారు. ప్రజలకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆయన వెంట సీపీఐ నాయకులు తాండ్ర సదానందం, మార్కపురి సూర్య, శనిగరపు చంద్రశేఖర్, మానస్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ నిర్మాతకు భారీ నష్టాలు.. అసలు బ్రేక్ ఈవెన్ అన్నా అవుతుందా?
Ala Venkateswar Reddy | కాంగ్రెస్ అసమర్థతతో ఎండిన పంటలు : మాజీ ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్‌రెడ్డి
IPL: చెన్నై జట్టులోకి ఎస్ఆర్హెచ్ బ్యాటర్.. 7 కోట్లు వదులుకున్న లివింగ్‌స్టోన్
Anjaiah Yadav | ఎండిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.. వీడియో
AP News | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 30.50 శాతం పోలింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

