Collector Koya Sri Harsha | పెద్దపల్లి రూరల్, ఆగస్టు 21: బీసీ హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వలలోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల స్థాయి వసతి గృహాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థులు, స్టాఫ్ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్ లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కామన్ డైట్ మెనూను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పిల్లలకు అందించే ఆహర పదార్థాల నాణ్యతను రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సంబంధిత జిల్లా శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.